Home > జాతీయం > దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జి.. ప్రారంభించిన ప్రధాని మోడీ

దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జి.. ప్రారంభించిన ప్రధాని మోడీ

దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జి.. ప్రారంభించిన ప్రధాని మోడీ
X

మహారాష్ట్రలో నూతనంగా నిర్మించిన అటల్ బిహారీ వాజ్పేయి సేవరి - న్హవ శేవ అటల్ సేతును ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్ తదితరులు ఉన్నారు. కాగా అటల్ సేతును ప్రారంభించడానికి ముందు ప్రధాని మోడీ నాసిక్ లో 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేకానంద స్వామిని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని ప్రధాని అన్నారు. కాగా అటల్ బిహారీ వాజ్పేయి సేవరి - న్హవ శేవ అటల్ సేతు భారతదేశంలోనే అతి పొడవైన వంతెన. అలాగే దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన కూడా. ఈ వంతెన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం- నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ముంబై నుండి పుణె, గోవా, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది.




Updated : 12 Jan 2024 2:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top