Home > జాతీయం > రామ మందిరమే.. కానీ అయోధ్యలోనిది కాదు

రామ మందిరమే.. కానీ అయోధ్యలోనిది కాదు

రామ మందిరమే.. కానీ అయోధ్యలోనిది కాదు
X

దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడంతా అయోధ్య రాముడి గురించే చర్చ నడుస్తోంది. అందుకు కారణం ఎల్లుండి అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుండటం. కాగా అచ్ఛం అయోధ్య రామ మందిరాన్ని పోలిన ఓ మందిరం ఇంకోటి చండీగఢ్‌లోని సెక్టార్ 34లో ఏర్పాటు చేశారు. అయితే ఇది నిజమైన గుడి కాదు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన సెట్టింగ్. 80 అడుగుల పొడవు 50 అడుగుల ఎత్తులో ఈ రామ మందిరం సెట్టింగ్ వేశారు. శ్రీ రామ్ కృపా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఈ గుడిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణం కావడంతో అక్కడికి వెళ్లడానికి ప్రతి ఒక్క భక్తుడు కోరుకుంటాడని, కానీ అది అందరికీ సాధ్యం కాదని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలోనే అలాంటి వాళ్ల కోసం అయోధ్య రామ మందిరాన్ని పోలిన ఆలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ క్రమంలోనే ఇవాళ కలశ యాత్ర నిర్వహించామని, ఈ కార్యక్రమానికి 5000 మంది మహిళలు హాజరయ్యారని అన్నారు.

ప్రఖ్యాత భజన గాయకుడు కన్హయ్య మిట్టల్ నేతృత్వంలోని ‘రామ్ భజన్ సంధ్య’ కార్యక్రమానికి నిర్వహించామని, అలాగే ఈ ఆలయంలోకి భక్తులకు ఉచితంగా ప్రవేశం కల్పించామని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అనూప్ గుప్తా తెలిపారు.ఇక ఈ రామ మందిరంలో లక్షల కొద్దీ లడ్డూలను భక్తులకు పంచిపెట్టారు. అయోధ్యకు వెళ్లలేని స్థానికులు ఈ రామ మందిరానికి క్యూ కడుతున్నారు. కాగా ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం ఎల్లుండి ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ వేడుకలకు రావాల్సిందిగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, వ్యాపారస్తుతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ట్రస్టు ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలోనే యూపీ ప్రభుత్వం ప్రారంభ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రముఖులు హాజరౌతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

Updated : 20 Jan 2024 8:41 PM IST
Tags:    
Next Story
Share it
Top