Home > జాతీయం > కేంద్రానికి రాకేశ్ టికాయత్ వార్నింగ్.. ఏమన్నారంటే?

కేంద్రానికి రాకేశ్ టికాయత్ వార్నింగ్.. ఏమన్నారంటే?

కేంద్రానికి రాకేశ్ టికాయత్ వార్నింగ్.. ఏమన్నారంటే?
X

మద్దతు ధర కల్పించాలంటూ ఢిల్లీకి బయలుదేరిన రైతులకు ఇబ్బంది కలిగించొద్దని, అలా చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) చీఫ్ రాకేశ్ టికాయత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారానికి రైతులు ఢిల్లీకి బయలుదేరారని, ప్రజాస్వామ్యయుతంగా వారు తమ డిమాండ్లను కేంద్రానికి తెలియజేస్తారని అన్నారు. దేశంలో అనేక రైతు సంఘాలు ఉన్నాయని, ఒక్కో సంఘానిది ఒక్కో సమస్య అని అన్నారు. వారందరికీ తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. రైతుల సంక్షేమమే ఎజెండాగా బీకేయూ పని చేస్తోందని ఓ మీడియా సమావేశంలో రాకేశ్ టికాయత్ తెలిపారు.

కాగా గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో రైతులు చేపట్టిన నిరసనలో రాకేశ్ టికాయత్ కీలక పాత్ర పోషించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం తేవాలని, 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసులు కొట్టివేయాలంటూ తాజాగా రైతులు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని తలపెట్టిన రైతులకు తన మద్దతు ఉంటుందని అన్నారు. కాగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ).. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా నడుస్తోన్న రైతు సంఘం. దీని వ్యవస్థాపకుల్లో ఇటీవల భారతరత్న పురస్కారానికి ఎంపికైన మాజీ ప్రధాని చరణ్ సింగ్ కూడా ఒకరు.

Updated : 13 Feb 2024 8:05 PM IST
Tags:    
Next Story
Share it
Top