Home > జాతీయం > అయోధ్య రాముడి మూడో విగ్రహం ఇదే.. ఎంత అందంగా ఉందో కదా!

అయోధ్య రాముడి మూడో విగ్రహం ఇదే.. ఎంత అందంగా ఉందో కదా!

అయోధ్య రాముడి మూడో విగ్రహం ఇదే.. ఎంత అందంగా ఉందో కదా!
X

అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో సోమవారం నాడు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగింది. రాముడి ప్రాణ ప్రతిష్ఠతో దేశమంతా భక్తిభావంతో పులకించిపోయింది. కాగా అయోధ్య రామ మందిరంలోని రాముడి విగ్రహం తయారీ కోసం దేశంలో ప్రతిభావంతులైన పలు శిల్పాకారులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. వారిలో నుంచి చివరిగా ముగ్గురిని ఎంపిక చేసి బాల రాముడి విగ్రహాలను తయారు చేయాలని చెప్పింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు, అదే ప్రాంతానికి చెందిన గణేష్ భట్, రాజస్థాన్ కు చెందిన సత్యనారాయణ పాండే లకు రాముడి విగ్రహాన్ని తయారు చేయాలని ట్రస్ట్ చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆ ముగ్గురు శిల్పాకారులు విగ్రహాలను తయారు చేసి రామాలయ ట్రస్ట్ కు అప్పగించారు. అయితే అందులో నుంచి చివరికి అరుణ్ యోగిరాజు చెక్కిన నల్లరాతి బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో పెట్టింది ట్రస్ట్ యాజమాన్యం.

ఇక మిగిలిన రెండు విగ్రహాలను గర్భగుడికి వెలుపల పెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాజస్థాన్ శిల్పాకారుడు సత్యనారాయణ పాండే తయారు చేసిన పాలరాతి రాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలను ట్రస్ట్ బయటపెట్టింది. ఈ చిత్రంలో రామ్ లల్లా నిలబడి ఉండగా ఓ చేతిలో బంగారు బాణం.. మరో చేతిలో బంగారు విల్లు ఉన్నాయి. ఇక రాముడి వెనుక భాగంలో అర్ధ ఛతురాస్రాకారంపై విష్ణుమూర్తి దశావతారాలకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. కాగా తాజాగా మైసూరుకు చెందిన గణేష్ భట్ చెక్కిన రాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలను ట్రస్ట్ బయటపెట్టింది. కర్ణాటకలోని మైసూర్‌లోని హెగడదేవనా కోటే ప్రాంతంలోని వ్యవసాయ భూమిలో దొరికిన నల్లరాయి (కృష్ణ శిల)ని ఉపయోగించి ఈ విగ్రహాన్ని చెక్కారు.

Updated : 24 Jan 2024 2:44 PM IST
Tags:    
Next Story
Share it
Top