Home > జాతీయం > గుండె పోటుతో కుప్పకూలిన సివిల్స్ విద్యార్థి.. హాస్పిటల్ కు పోయేలోపే!

గుండె పోటుతో కుప్పకూలిన సివిల్స్ విద్యార్థి.. హాస్పిటల్ కు పోయేలోపే!

గుండె పోటుతో కుప్పకూలిన సివిల్స్ విద్యార్థి.. హాస్పిటల్ కు పోయేలోపే!
X

ఇటీవలి కాలంలో చాలా మంది గుండె పోటుతో మరణిస్తున్నారు. మరీ ముఖ్యంగా యువకులు, విద్యార్థులు కూడా గుండె పోటు వల్ల ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి గుండె పోటుతో కోచింగ్ సెంటర్ లోనే ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాకు చెందిన రాజా లోధీ అనే యువకుడు ఇండోర్ లో సివిల్ సర్విసెస్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో లోధీ క్లాస్ రూమ్ లో లెక్చరర్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్నాడు. అయితే అతడికి సడెన్ గా గుండెపోటు రావడంతో బెంచీ మీదే కుప్పకూలిపోయాడు. అది గమనించిన తోటి విద్యార్థులు లోధీని దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

అయితే యువకుడిని పరిశీలించిన వైద్యులు అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. కాగా లోధీ మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. గుండెపోటుతోనే లోధీ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ఓ ప్రాథమిక అంచనాకు మాత్రమే వచ్చారు. అతడి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




Updated : 18 Jan 2024 5:05 PM IST
Tags:    
Next Story
Share it
Top