ఏఐసీసీ పబ్లిసిటీ కమిటీ ఏర్పాటు
X
రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ పబ్లిసిటీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. ఏఐసీసీ ట్రెజరర్ ఈ కమిటీకి కన్వీనర్ గా ఉంటారు. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ (AICC), జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ (AICC), ఇంఛార్జ్ అడ్మిషన్స్ (AICC), చైర్ పర్సన్, మీడియా అండ్ పబ్లిసిటీ డిపార్ట్ మెంట్ (AICC), చైర్ పర్సన్, సోషల్ మీడియా డిపార్ట్ మెంట్ (AICC), ప్రత్యేక ఆహ్వానితులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారం కల్పించే పనిని ఈ కమిటీ చూసుకుంటుంది. సభలు, సమావేశాలు, పార్టీ పథకాలపై మీడియా, సోషల్ మీడియా లేదా నేరుగానైనా పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది.