Home > జాతీయం > ఢిల్లీ సీఎం ఇంటికి నోటీసులతో వెళ్లిన పోలీసులు

ఢిల్లీ సీఎం ఇంటికి నోటీసులతో వెళ్లిన పోలీసులు

ఢిల్లీ సీఎం ఇంటికి నోటీసులతో వెళ్లిన పోలీసులు
X

తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల చేసిన ఆరోపణలో నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నోటీసులు అందజేసేందుకు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల బృందం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లింది. కేజ్రీవాల్‌తో పాటు మంత్రి అతిషి నివాసానికి కూడా పోలీస్ టీమ్ వెళ్లింది. అయితే అటు కేజ్రీవాల్ కానీ, ఇటు అతిషి కానీ తమ నివాసాల్లో లేకపోవడంతో నోటీసులు అందజేయలేకపోయింది. ఢిల్లీ మంత్రి అతిషి గత వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. పార్టీని విడిచిపెట్టాల్సిందిగా ఆప్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, ఒక్కొక్కరికి రూ.25 కోట్లు చొప్పున ఇవ్వజూపిందని ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముప్పు పొంచి ఉందని అన్నారు. కేజ్రీవాల్ సైతం తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించినట్టు ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇవాళ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఢిల్లీ సీఎవ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఢిల్లీ బీజేపీ అద్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ తోసిపుచ్చారు. 70 మంది ఎమ్మెల్యేలలో 62 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఆప్ ఈ తరహా ఆరోపణలు చేయడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.



Updated : 2 Feb 2024 4:32 PM GMT
Tags:    
Next Story
Share it
Top