ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
Vijay Kumar | 11 Jan 2024 3:41 PM IST
X
X
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనం భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. పంజాబ్, చంఢీగఢ్, ఘజియాబాద్, జమ్ముకశ్మీర్ లోనూ భూమి కంపించింది. అలాగే పాకిస్తాన్ లోని లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ పక్తుంక్వాలో ప్రకంపనలు వచ్చాయి. ఇస్లామాబాద్‌లోను భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదైంది. అయితే ఈ ప్రకంపనల వల్ల పెద్ద ప్రమాదమేమీ సంభవించలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
Updated : 11 Jan 2024 3:41 PM IST
Tags: Tremors In Delhi Parts Of North India After 6.1 Earthquake Earthquake tremors felt in Delhi-NCR Earthquake in Delhi Earthquake Tremors Felt In Delhi-NCR Region Earthquake In Delhi NCR: Tremors Felt In Noida Earthquake in Delhi-NCR Delhi earthquake latest news update
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire