Milind Deora : శివసేనలో చేరిన కాంగ్రెస్ ముఖ్య నేత
X
కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా శివసేన (షిండే వర్గం)లో చేరారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి దేవరా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేరారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా కాంగ్రెస్ ను వీడారు. ఈ క్రమంలోనే ఆయన శివసేన తీర్థం పుచ్చుకున్నారు. ముంబయి సౌత్ లోక్ సభ స్థానం నుంచి మిలింద్ దేవరా కాంగ్రెస్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన (యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఇక తన స్థానం నుంచే మిలింద్ దేవరా శివసేన (షిండే వర్గం) తరఫున పోటీ చేయనున్నారని, ఈ మేరకు ఆయనకు హామీ లభించాకే పార్టీలో చేరారని తెలుస్తోంది.