Home > జాతీయం > మంత్రిని సన్మానిస్తుండగా కుప్పకూలిన స్టేజీ

మంత్రిని సన్మానిస్తుండగా కుప్పకూలిన స్టేజీ

మంత్రిని సన్మానిస్తుండగా కుప్పకూలిన స్టేజీ
X

రాజస్థాన్ లో ఘోరం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే హీరాలాల్ నాగర్‌కు మంత్రి పదవి దక్కడంతో కార్యకర్తలు ఆయనకు సన్మానం చేస్తుండగా ఒక్కసారిగా స్టేజీ కుప్పకూలింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అంతా జరగడంతో దీంతో అక్కడున్నవారంతా ఖంగుతిన్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రిని కాపాడారు. ఈ ప్రమాదంలో మంత్రితో పాటు ఐదుగురికి గాయాలయ్యాయి. వాళ్లను స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఇటీవల జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భజన్ లాల్ శర్మ రాజస్థాన్ 14వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక డిప్యూటీ సీఎంగా దియా కుమారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల సీఎం పలువురు బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కల్పించగా.. హీరాలాల్ నాగర్ కు కూడా మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి దక్కిన ఆనందంలో సన్మానం చేస్తుండా అపశృతి జరిగింది.

Updated : 6 Jan 2024 5:25 PM IST
Tags:    
Next Story
Share it
Top