Home > జాతీయం > మోడీపై కామెంట్స్.. మాల్దీవులకు భారీ నష్టం

మోడీపై కామెంట్స్.. మాల్దీవులకు భారీ నష్టం

మోడీపై కామెంట్స్.. మాల్దీవులకు భారీ నష్టం
X

ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు, ఎంపీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాల్దీవులకు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. భారత ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇప్పటికే భారత్ కు చెందిన పలువురు ప్రముఖులు మాల్దీవుల మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. ఇక ప్రధాని మోడీని హేళన చేస్తూ మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశం భారీగా నష్టపోయింది. మాల్దీవుల్లోని హోటళ్లలో భారతీయులు చేసుకున్న దాదాపు 10,500 బుకింగ్స్, 5520 ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇంత పెద్దఎత్తున బుకింగ్స్ క్యాన్సిల్ కావడం మాల్దీవుల చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక బుకింగ్స్ క్యాన్సిల్ నేపథ్యంలో అక్కడి హోటళ్లు, విమానయాన సంస్థలు మంత్రులపై అసంతృప్తిని వెళ్లగక్కాయి.

కాగా ఇటీవల ప్రధాని మోడీ లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. వాటిపై మాల్దీవులు మంత్రి మరియం షియునా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ దేశపు తోలు బొమ్మ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే అభిప్రాయాన్ని అక్కడి మంత్రులు మల్షా షరీఫ్, మహ్జూమ్ మజీద్ వ్యక్తం చేశారు. టూరిజంలో మాల్దీవులతో లక్ష్యదీప్ పోటీ పడటం భ్రమనేనని అని అన్నారు. ఇక మాల్దీవులు మంత్రుల వ్యాఖ్యలను భారత్ కు చెందిన పలువురు ప్రముఖులు ఖండించారు. ఈ నేపథ్యంలోనే భారత్ లోనే కాక ప్రపంచవ్యాప్తంగా మాల్దీవులపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మాల్దీవులు ప్రభుత్వం ఆ మంత్రులను సస్పెండ్ చేసింది.




Updated : 7 Jan 2024 3:39 PM GMT
Tags:    
Next Story
Share it
Top