Home > జాతీయం > శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం ఎత్తివేత

శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం ఎత్తివేత

శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం ఎత్తివేత
X

శ్రీలంక క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీలంక క్రికెట్ బోర్డుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. తమ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని ఐసీసీ పేర్కొంది. కాగా గతేడాది నవంబర్ 11న శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. శ్రీలంక క్రికెట్ (SLC) సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐసీసీ సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని పేర్కొంది. ఓ సభ్య దేశంగా శ్రీలంక బోర్డు స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోయిందని తెలిపింది. ప్రతి విషయంలో ఆ దేశ ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని, బోర్డు స్వతంత్రంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లోనూ ప్రభుత్వ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది. అందుకే సస్పెన్షన్ విధిస్తున్నామని నాడు ఐసీసీ పేర్కొంది. అయితే బోర్డు సస్పెన్షన్ నుండి నేటి వరకు పరిస్థితిని పర్యవేక్షించిన ఐసీసీ.. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వ బాధ్యతలను ఉల్లంఘించలేదని సంతృప్తి చెందింది. ఈ నేపథ్యంలోనే శ్రీలంక బోర్డుపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

Updated : 28 Jan 2024 8:10 PM IST
Tags:    
Next Story
Share it
Top