Home > జాతీయం > ఎన్డీఏలోకి బీహార్ సీఎం నితీశ్.. రాహుల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే

ఎన్డీఏలోకి బీహార్ సీఎం నితీశ్.. రాహుల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే

ఎన్డీఏలోకి బీహార్ సీఎం నితీశ్.. రాహుల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే
X

ఇండియా కూటమిలో క్రియాశీల పాత్ర పోషించిన బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఇటీవల ఎన్డీఏలో చేరారు. బీహార్ లోని మహా ఘట్ బంధన్ నుంచి బయటకు వచ్చి బీజేపీ సహాయంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9వసారి సీఎం అయ్యారు. కాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటిసారి స్పందించారు. మంగళవారం తన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బీహార్ లో జరిగిన ఓ సభలో రాహుల్ మాట్లాడుతూ నితీశ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. కొద్దిపాటి రాజకీయ ఒత్తిడి రాగానే నితీశ్ యూ టర్న్ తీసుకున్నారని, అలాంటి వ్యక్తులు ఇండియా కూటమికి అవసరం లేదని స్పష్టం చేశారు.

గవర్నర్ నివాసంలో ఇటీవల నితీశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని, ఆయనతో పాటు కొందరూ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారని రాహుల్ అన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత నితీశ్ తన నివాసానికి వెళ్తుండగా శాలువా మరిచిపోతే మళ్లీ గవర్నర్ నివాసానికి వెళ్లారని, అది చూసిన గవర్నర్ 'నితీశ్ జీ.. అప్పుడే మళ్లీ వచ్చారా' అని అడిగారని సెటైర్లు వేశారు. మహా ఘట్ బంధన్ ప్రభుత్వ హయాంలో తాము పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం జరగాలి అన్న సూత్రం నితీశ్ కు నచ్చలేదని, అందుకే ఆయన ఎన్డీఏలోకి వెళ్లారని రాహుల్ అన్నారు.

Updated : 30 Jan 2024 11:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top