Marriages : భారత్లో పెళ్లి సందడి.. రానున్న 6 నెలల్లో 42 లక్షల పెళ్లిళ్లు
X
దేశంలో పెళ్లి సందడి మొదలైంది. రానున్న ఆరు నెలల్లో దేశంలో 42 లక్షల పెళ్లిళ్లు జరిగే సూచనలు ఉన్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ సంస్థ సర్వే తెలిపింది. గత నెల 15 నుంచి జులై 15 వరకు దాదాపు అరకోటి పెళ్లిళ్లు జరగనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక ఈ పెళ్లిళ్ల ద్వారా దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరగనుందని అన్నారు. ఇక పెళ్లిళ్లలో దేశరాజధాని ఢిల్లీలోనే దాదాపు 4 లక్షలకు పైగా వివాహాలు జరగనుండగా.. వాటి ద్వారా ఒకటిన్నర లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని ఆ సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భారతీయ, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. గతేడాది చివరి వరకు దాదాపు 35 లక్షల వివాహాలు జరగ్గా.. వాటి ద్వారా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు.
ఇక ఈ ఏడాది జరిగే పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులో 20 శాతం వరుడు, వధువు కుటుంబాల ఖర్చుకు పోగా.. మిగిలిన ఖర్చు వివాహ ఏర్పాట్లకు అయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇక పెళ్లి అనగానే ఇంటికి పెయింటింగ్, వధూవరులు, కుటుంబ సభ్యులకు దుస్తులు, బంగారు ఆభరణాలు, షామియానా, ఫంక్షన్ హాల్ బుకింగ్, ఘుమఘుమలాడే వంటలు, విందు, వినోదం వంటివి ఎన్నో ఉంటాయి.