2 రూపాయలకే రూ.15 లక్షల ఇన్సూరెన్స్!
X
ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. రోజుకి కేవలం 2 రూపాయల చొప్పున ఏడాదికి రూ.755 చెల్లిస్తే రూ.15 లక్షల ఇన్సూరెన్స్ ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే ఏడాదికి రూ.520తో రూ.10 లక్షల బీమా, రూ. 320తో రూ.5 లక్షల బీమా పాలసీని తీసుకొచ్చింది. టాటా AIGతో కలిసి గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ (GAG) పేరిట ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. 18 నుంచి 65 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న ఎవరైనా ఈ బీమా పాలసీని తీసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మాత్రమే ప్రీమియం చెల్లించాలి. అంటే..
ఈ బీమా తీసుకోవాలంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఖాతా ఉండడం తప్పనిసరి. కేవలం రూ.100తో ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పాలసీదారు రోడ్డు ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందుతాయి. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే లక్ష రూపాయలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తంలో ఏది తక్కువైతే అది చెల్లిస్తారు.