Railway Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9 వేల పోస్టులకు నోటిఫికేషన్
X
నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో రైల్వే విభాగంలోని 9000 టెక్నీషియన్ పోస్ట్ లను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 9న ప్రారంభమవుతుంది. అప్లికేషన్ ఫాం సమర్పించడానికి ఏప్రిల్ 8 చివరి తేదీ. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆర్ఆర్బీ అఫిషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు సహా పూర్తి వివరాలు మార్చి 9న అన్ని ఆర్ఆర్బీ వెబ్ సైట్లలో విడుదల చేయనున్నారు.
ఖాళీల వివరాలు
.. మొత్తం 9000 ఖాళీలను భర్తీ చేస్తున్నారు
.. వీటిలో 1100 ఖాళీలు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్
.. 7900 ఖాళీలు టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ పోస్టులు ఉన్నాయి.
వయసు
..టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కు అభ్యర్థుల గరిష్ట వయస్సు 18 నుండి 36 సంవత్సరాలు
..టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు అభ్యర్థుల గరిష్ట వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి
2024 దరఖాస్తు ఫీజు
.. ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు దరఖాస్తు ఫీజు రూ.250. మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500.
విద్యార్హతలు
..మార్చి 9వ తేదీన అధికారిక ఆర్ఆర్బీ వెబ్ సైట్ లో విభాగాల వారీగా పూర్తి విద్యార్హతలను విడుదల చేస్తారు.