ప్రయాణికులకు ఇండిగో సిబ్బంది వినూత్న స్వాగతం
X
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని ఈ నెల 22న ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ వేడుకకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలతో పాటు దేశ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండిగో సిబ్బంది వినూత్నంగా ప్రయాణికులకు స్వాగతం పలికారు. సీతారామ లక్ష్మణ హనుమ వేషధారణలో వచ్చి ప్రయాణికులను విమానంలోకి ఆహ్వనించారు. అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి అహ్మదాబాద్ నుంచి ఇండిగో తన తొలి విమానాన్ని గురువారం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ సర్వీసును వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండిగో సిబ్బంది సీతారామ లక్ష్మణ వేషధారణలో ప్రయాణికులకు స్వాగతం పలికారు. బోర్డింగ్ అనౌన్స్ మెంట్ చేయడంతో పాటు విమానం ఎక్కేందుకు ప్రయాణికులను ఆహ్వానించారు. ఇండిగో సిబ్బంది చేపట్టిన ఈ చర్యపై అక్కడున్న ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు. కాగా ప్రస్తుతం ఇండిగో సిబ్బందికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.