Home > జాతీయం > 50 ఏళ్లకే పింఛన్.. సీఎం సంచలన ప్రకటన

50 ఏళ్లకే పింఛన్.. సీఎం సంచలన ప్రకటన

50 ఏళ్లకే పింఛన్.. సీఎం సంచలన ప్రకటన
X

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన చేశారు. 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామని అన్నారు. గతంలో 60 ఏళ్లు ఉన్న పింఛన్ అర్హత వయస్సును ఏకంగా 10 ఏళ్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాంచీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన వరాల జల్లు కురిపించారు. దళితులు, గిరిజనులకు వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గిస్తామని అన్నారు. దళితులు, గిరిజనుల్లో మృత్యురేటు ఎక్కువగా ఉందని, 60 ఏళ్లు నిండాక వాళ్లలో చాలా మందికి ఎలాంటి ఉపాధిలేకుండా పోతుందని అన్నారు. ఈ క్రమంలోనే పింఛన్ వయస్సును తాము 50 ఏళ్లకు తగ్గిస్తున్నామని, దీని వల్ల ఆర్థికంగా వెనకబడ్డ ఎందరో ఎస్సీ, ఎస్టీ ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తమ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకు 16 లక్షల మందికి మాత్రమే పింఛన్లు వచ్చాయని, కానీ తమ సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక 36 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కార్యాలయాలను ఏర్పాటు చేసే కంపెనీలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేస్తామని వెల్లడించారు.




Updated : 29 Dec 2023 7:43 PM IST
Tags:    
Next Story
Share it
Top