Home > జాతీయం > తెలంగాణ నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ డబ్బు తరలిస్తోంది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ డబ్బు తరలిస్తోంది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ డబ్బు తరలిస్తోంది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ డబ్బు తరలిస్తోందని అన్నారు.అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి మోడీ తన సత్తాను చాటుకున్నారని అన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్లతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అహా నా పెళ్ళి అంటా సినిమాలో లాగా రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లతో కేసీఆర్ మోసం చేస్తే.. మోడీ పేదల కోసం ఇండ్లు, టాయిలెట్లను నిర్మించారని అన్నారు. పేద వాళ్ళ కోసం వంట గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారని, పేదవారు ఆరోగ్యం కోసం బీమా సౌకర్యం కల్పించారని అన్నారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాలకు రూ.20 లక్షల రుణాలు ఇవ్వాలని మోడీ నిర్ణయించారని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించారని, జాతీయ రహదారులను విస్తరించారని అన్నారు. గతంలో ఉగ్రవాదుల దాడులు, మత కల్లోలాలు ఉండేవని, మోడీ వచ్చిన తర్వాత వాటిని నియంత్రించారని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు మన ప్రధాని ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నారంటే అది మోడీ వల్లే సాధ్యమైందని అన్నారు. ప్రపంచ దేశాల అధినేతల మధ్యలో మన ప్రధాని కనబడుతున్నారని అన్నారు. ప్రధాన సేవకుడిగా సెలువు తీసుకోకుండా మోడీ నిరంతరం పని చేస్తున్నారని, కానీ కేసీఆర్ ఒక్క రోజు కూడా సచివాలయానికి రాలేదని అన్నారు. మోడీ పాలనలో దేశం సుభిక్షంగా శాంతియుతంగా ఉందని, ముస్లిం మహిళలకు సమస్యగా ఉన్న తలాక్ ను మోడీ రద్దు చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్లు దేశాన్ని దోచుకున్నారని, కాంగ్రెస్ దోపిడీకి ప్రతిరూపమని మండిపడ్డారు. సకల రోగాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని అన్నారు. రెండు పార్టీలూ దోచుకున్న పార్టీలేనని అన్నారు.


Updated : 23 Feb 2024 9:14 PM IST
Tags:    
Next Story
Share it
Top