Home > జాతీయం > మరో నమిబియా చీతా మృతి.. వరుసగా ఇది పదో మరణం

మరో నమిబియా చీతా మృతి.. వరుసగా ఇది పదో మరణం

మరో నమిబియా చీతా మృతి.. వరుసగా ఇది పదో మరణం
X

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి చెందింది. ఈ రోజు మధ్యాహ్నం నమీబియా నుంచి తెచ్చిన చీతా శౌర్య మృతి చెందినట్లు లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు ఉదయం చీతా శౌర్య నీరసంగా కనిపించిందని, తూలుతూ నడిచిందని అధికారులు తెలిపారు. దీంతో బలహీనంగా ఉన్న ఆ చీతాకు చికిత్స అందించామని అన్నారు. కోలుకున్నట్లు కనిపించిందని, కానీ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చీతా శౌర్య చనిపోయిందని తెలిపారు. పోస్టుమార్టం తర్వాతే శౌర్య మృతికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు. కాగా కునో నేషనల్ పార్కులో చీతా మరణించడం వరుసగా ఇది పదోది. ఇక చీతాల వరుస మరణాలు అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

కాగా భారత్ లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే నమీబియా, సౌతాప్రికా నుంచి రెండు విడతల్లో 20 చీతాలను భారత్ కు రప్పించారు. వాటిని మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో విడిచిపెట్టారు. అయితే ఇందులో ఇప్పటికే 6 చీతాలు పలు కారణాలతో చనిపోయాయి. ఇక జ్వాల అనే చీతాకు గతేడాది నాలుగు కూనలు పుట్టగా అందులో మూడు చనిపోయాయి. ఇక తాజాగా శౌర్య మృతితో చీతా మరణాల సంఖ్య 10కి చేరింది.

Updated : 16 Jan 2024 12:57 PM GMT
Tags:    
Next Story
Share it
Top