మహారాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్
X
మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండేకు కరోనా సోకింది. ఆయన కొంత అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఆయన కార్యాలయం తెలిపింది. నాగ్‌పూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజైన డిసెంబర్ 20న మంత్రి ధనంజయ్ ముండే కరోనా బారినపడినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఇక కరోనా రావడంతో ఆయన తన ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నారని, వైద్యుల సూచనలు పాటిస్తున్నారని మహారాష్ట్రం ప్రభుత్వం పేర్కొంది. ఇక ఐసోలేషన్ లో ఉన్న మంత్రి..వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన శాఖ వ్యవహారాలు చూస్తున్నారని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. కాగా మంత్రి కార్యాలయంలో పని చేసే కొంతమంది సిబ్బంది అనారోగ్యానికి గురి కాగా.. వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే వారికి కరోనా లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఇక మంత్రికి కరోనాకు సంబంధించిన ఏ వేరియంట్ అటాక్ చేసిందనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఇక మంత్రి ధనుంజయ్ త్వరగా కోలుకోవాలని అక్కడి సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకాంక్షించారు.