Home > జాతీయం > కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వం.. Mamata Banerjee

కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వం.. Mamata Banerjee

కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వం.. Mamata Banerjee
X

ఇండియా కూటమికి ఇబ్బందులు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. ఇప్పటికే పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోమని అక్కడి సీఎం భగవంత్ మాన్ ప్రకటించగా.. మొన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇండియా కూటమికి బై చెప్పి ఎన్డీఏతో జతకట్టారు. ఇక ప‌శ్చిమ‌ బెంగాల్‌లో విప‌క్ష ఇండియా కూట‌మి ఇబ్బందులు ఇప్ప‌ట్లో స‌మసిపోయేలా లేవు. త‌మ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే సీపీఎంతో కాంగ్రెస్ తెగ‌దెంపులు చేసుకోవాల‌ని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ హ‌స్తం పార్టీకి ష‌ర‌తు విధించారు. సీట్ల స‌ర్దుబాటు చ‌ర్చ‌ల సంద‌ర్భంగా తాను కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఇవ్వ‌చూపితే తిర‌స్క‌రించార‌ని, ఇక ఇప్పుడు తాను ఒక్క సీటు కూడా ఇచ్చేది లేద‌ని దీదీ స్ప‌ష్టం చేశారు. గ‌తంలో సీపీఎం త‌నపై ప‌లుమార్లు భౌతిక దాడులు చేసింద‌ని, త‌న‌ను నిర్ధాక్షిణ్యంగా కొట్టార‌ని, శ్రేయోభిలాషుల ఆశీస్సుల‌తోనే తాను బతికి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని దీదీ గుర్తుచేశారు.

లెఫ్ట్‌ను తాను ఎన్న‌డూ మ‌న్నించ‌న‌ని, సీపీఎంను అస‌లు విడిచిపెట్టేది లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈరోజు సీపీఎంతో జ‌ట్టు క‌ట్టిన‌వారిని తాను మ‌రువ‌న‌ని అన్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ బుధ‌వారం మాల్ధాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. తాను కాంగ్రెస్‌కు రెండు లోక్‌స‌భ స్ధానాలు ఇచ్చి వారిని గెలిపించుకుంటానంటే వారు ఎక్కువ స్ధానాల‌ను కోరుకున్నార‌ని, మీరు లెఫ్ట్‌తో జ‌ట్టుక‌డితే తాను వారికి ఒక్క సీటు కూడా ఇవ్వ‌న‌ని చెప్పాన‌ని దీదీ తేల్చిచెప్పారు. ఇక బెంగాల్‌లో సీపీఎంతో పొత్తు ఉండ‌బోద‌ని సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి గ‌తంలో వెల్ల‌డించారు. బీజేపీ, టీఎంసీతో పోరాడేందుకు లెఫ్ట్‌, కాంగ్రెస్‌తో పాటు లౌకిక పార్టీలు క‌లిసివ‌స్తాయ‌ని ఆయ‌న ప‌లుమార్లు పేర్కొన్నారు.

Updated : 31 Jan 2024 1:53 PM GMT
Tags:    
Next Story
Share it
Top