Home > జాతీయం > Ayodhya Ram Temple : బియ్యపు గింజపై అయోధ్య మందిరం

Ayodhya Ram Temple : బియ్యపు గింజపై అయోధ్య మందిరం

Ayodhya Ram Temple : బియ్యపు గింజపై అయోధ్య మందిరం
X

శ్రీ రాముడి మీద ఉన్న అభిమానాన్ని ఓ వ్యక్తి వినూత్నంగా చాటుకున్నాడు. బియ్యపు గింజపై అయోధ్య రామ మందిరాన్ని చెక్కి తన కళా నైపుణ్యాన్ని చాటుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన శ్రీరామోజు జయకుమార్ మైక్రో ఆర్టిస్టు. దేవుళ్లు, జాతీయ నాయకుల వంటి వాళ్ల రూపాలను బియ్యపు గింజలపై చెక్కుతూ ఉంటాడు. తాజాగా ఆయన తన కళా నైపుణ్యాన్ని మరోసారి చాటుకున్నాడు. అయోధ్య శ్రీరామ మందిరంలో రేపు బాల రాముడి ప్రాణప్రతిష్ఠ గావించబడుతున్న సందర్భంగా బియ్యపు గింజపై అయోధ్య మందిరాన్ని జయకుమార్ చెక్కాడు. రామయ్యపై ఉడుతాభక్తిగా తాను మందిరాన్ని లిఖించినట్లు జయకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో జయకుమార్ కళా ప్రతిభను పలువురు అభినందించారు.

కాగా ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం రేపు ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ వేడుకలకు రావాల్సిందిగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, వ్యాపారస్తుతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ట్రస్టు ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలోనే యూపీ ప్రభుత్వం ప్రారంభ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రముఖులు హాజరౌతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

Updated : 21 Jan 2024 2:29 PM GMT
Tags:    
Next Story
Share it
Top