Home > జాతీయం > భారీ పేలుళ్లకు కుట్ర.. నాలుగు రాష్ట్రాల్లో 8 మంది అరెస్ట్

భారీ పేలుళ్లకు కుట్ర.. నాలుగు రాష్ట్రాల్లో 8 మంది అరెస్ట్

భారీ పేలుళ్లకు కుట్ర.. నాలుగు రాష్ట్రాల్లో 8 మంది అరెస్ట్
X

ISISతో సంబంధం ఉన్న ఎనిమిది మంది ఏజెంట్లను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. వీరు దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. ISIS బళ్లారి మాడ్యూల్ కు చెందిన వీరివద్ద నుంచి పేలుడు పదార్థాలు, మారణాయుధాలు, నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరంతా భారీ పేలుళ్లకు కుట్ర పన్నారని, ఈ క్రమంలో దాడులకు సంబంధించిన ప్లానింగ్ పేపర్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సోమవారం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో NIA రైడ్లు నిర్వహించింది. అందులో 8 మందిని అరెస్ట్ చేసింది.

కర్ణాటక, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీలోని ISIS ఏజెంట్ల స్థావరాలపై NIA దాడులు చేపట్టింది. 19 ప్రాంతాల్లో అధికారులు రైడ్లు నిర్వహించారు. కాగా ఈ దాడుల్లో బళ్లారిలో పట్టుబడ్డ మినాజ్ అలియాస్ మహమ్మద్ సులేమాన్ నేతృత్వంలో మిగతా ఉగ్రవాదులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. నిందితులు ఒకరినుంచి ఒకరికి కమ్యూనికుషన్ జరపడానికి సోషల్ మీడియాను వాడుతున్నారు. ఇదిలా ఉండగా.. గత వారం NIA అధికారులు మహారాష్ట్రలోని 40 చోట్ల దాడులు జరిపి, 15 మంది అనుమానితులను అరెస్టు చేశారు.

Updated : 18 Dec 2023 3:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top