Home > జాతీయం > రామ మందిర గర్భగుడిలోకి ఆ ఐదుగురికే ఛాన్స్

రామ మందిర గర్భగుడిలోకి ఆ ఐదుగురికే ఛాన్స్

రామ మందిర గర్భగుడిలోకి ఆ ఐదుగురికే ఛాన్స్
X

వచ్చే నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖలను శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర్‌ ట్రస్ట్‌ ఆహ్వానించింది. కాగా ప్రారంభోత్సవానికి సంబంధించిన తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ప్రారంభం రోజున శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రామ మందిర గర్భగుడిలోకి ఐదుగురికి మాత్రమే ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ యోగి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తో పాటు ఆలయ ప్రధాన అర్చకుడికి మాత్రమే ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుందని సమాచారం. ఈ ఐదుగురు గర్భగుడిలోకి వెళ్లగానే గర్భగుడి తలుపులు మూసుకుంటాయని తెలుస్తోంది. కాగా ఈ ప్రారంభోత్సవ వేడుకకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులతో పాటు సినీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పలువురు క్రీడాకారులు హాజరుకానున్నారు. అలాగే ఈ వేడుకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను కూడా ట్రస్ట్ ఆహ్వానించింది.




Updated : 29 Dec 2023 4:00 PM IST
Tags:    
Next Story
Share it
Top