ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం?
X
జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అనంతనాగ్ కు వెళ్తుండగా సంగమ్ వద్ద ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. దీంతో ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం నుజ్జు నుజ్జైంది. అయితే ఈ ప్రమాదంలో మహబూబా ముఫ్తీ, ఆమె భద్రతాసిబ్బందికి ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని పీడీపీ మీడియా సెల్ పేర్కొంది. అగ్ని ప్రమాదంలో బాధితులను పరామర్శించేందుకు ఖానాబాల్‌కు వెళ్తున్న క్రమంలో ముఫ్తీ కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. అయితే ఆమెకు పెద్ద గాయాలేమీకాలేదని, ఆమె వ్యక్తిగత భద్రతలో ఉన్న ఒక పోలీసు అధికారికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ముఫ్తీ అక్కడి నుంచి నేరుగా వేరే కారులో ఖానాబాల్ కు వెళ్లి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారని పేర్కొన్నారు.