మహర్షి వాల్మీకి ఎయిర్ పోర్టును ప్రారంభించిన పీఎం
X
వచ్చే నెల (జనవరి) 22న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ కొత్తగా నిర్మించిన పలు కట్టడాలకు పీఎం మోడీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇప్పటికే అయోధ్యలో నిర్మించిన రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని.. తాజాగా అక్కడ కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఫేజ్ 1 లో భాగంగా మొత్తం రూ.1450 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. టెర్మినల్ వైశాల్యం 6500 చదరపు మీటర్లు ఉంటుంది. ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణించేగలిగే సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. కాగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులు, సీఎంలు, గవర్నర్లు, బడా పారిశ్రామిక వేత్తలు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులు తదితరులు హాజరు కానున్నారు.