Home > జాతీయం > PM Modi : ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శం కానుంది.. ప్రధాని మోడీ

PM Modi : ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శం కానుంది.. ప్రధాని మోడీ

PM Modi  : ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శం కానుంది.. ప్రధాని మోడీ
X

అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శం కానుందని, వచ్చే ఐదేళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరనుందని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా రూ.13 వేల కోట్ల విలువైన పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్ మారుతుందని, ఇది మోడీ గ్యారెంటీ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధితో పాటు గత పదేళ్లలో వారణాసి కూడా ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. బనారస్ లో ఇటీవల బ్రిడ్జి నిర్మాణం తర్వాత ప్రయాణ సమయం ఎంతో తగ్గిందని అన్నారు.

కాశీలో సంస్కృతి, సంప్రదాయాల చుట్టూ ఆధునికత ఎలా అభివృద్ధి చెందిందో దేశం మొత్తం చూసిందని అన్నారు. అమృత్ కాల్ వేళ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని బనారస్ యూనివర్సిటీ విద్యార్థులను చూస్తే నమ్మకం కలుగుతుందని అన్నారు. ఇక ఇండియా కూటమిలోని పార్టీలు కులతత్వ పార్టీలని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులతత్వం పేరిట ప్రజలను ఆ పార్టీలు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. అవన్నీ కుటుంబ పార్టీలని, కుటుంబాల శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తుంటాయని అన్నారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించాలని మోడీ కోరారు.




Updated : 23 Feb 2024 10:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top