Home > జాతీయం > రేపు పీఎం చేతుల మీదుగా సూరత్ డైమండ్స్ బోర్స్ ప్రారంభం

రేపు పీఎం చేతుల మీదుగా సూరత్ డైమండ్స్ బోర్స్ ప్రారంభం

రేపు పీఎం చేతుల మీదుగా సూరత్ డైమండ్స్ బోర్స్ ప్రారంభం
X

గుజరాత్‌లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన ‘సూరత్ డైమండ్ బోర్స్’ భవనాన్ని ప్రధాని మోడీ రేపు (డిసెంబర్‌ 17న) ప్రారంభించనున్నారు. డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో నిర్మితమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 35.54 ఎకరాల్లో దాదాపు రూ.3 వేల 500 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన సముదాయం ఉంది. ఈ బిల్డింగ్ లో 4,700 కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం 130 కార్యాలయాలు వాడుకలో ఉన్నాయి. ఈ క్యాంపస్‌లో పలు కార్యాలయాలతోపాటు సేఫ్ డిపాజిట్ వాల్ట్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్, రెస్టారెంట్స్‌, బ్యాంకులు, కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్‌లు, ట్రైనింగ్ సెంటర్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్, రెస్టారెంట్స్‌, సెక్యూరిటీతో పాటు క్లబ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

Updated : 16 Dec 2023 10:08 PM IST
Tags:    
Next Story
Share it
Top