Home > జాతీయం > INDIA కూటమి కన్వీనర్ గా మల్లికార్జున ఖర్గే!

INDIA కూటమి కన్వీనర్ గా మల్లికార్జున ఖర్గే!

INDIA కూటమి కన్వీనర్ గా మల్లికార్జున ఖర్గే!
X

విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. అత్యధికులు ఆయన వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. విపక్ష కూటమి కన్వీనర్ పదవిని జేడీయూ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆశిస్తున్నారంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. ఇండియా కూటమికి ఆయన్నే కన్వీనర్ గా నియమించాలని శివసేన(యూబీటీ), ఇతర పార్టీల నేతలు ప్రతిపాదనలు కూడా చేశారు. అయితే తాజాగా నితీశ్ కుమార్ తనకు ఎలాంటి పదవి అవసరం లేదని తేల్చి చెప్పారు. తాను మొదటి నుంచి ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నానని అన్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా వర్చువల్ గా భేటీ అయిన ఇండియా కూటమి ముఖ్య నేతలు ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ కు ఇస్తే బాగుంటుందని సూచనలు చేశారు. ఈ క్రమంలోనే ఇండియా కూటమి కన్వీనర్ గా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎన్నుకున్నారని తెలుస్తోంది. కూటమిలోని మెజారిటీ పార్టీలు ఆయనకే మద్దతు పలుకినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఎన్నికకు సంబంధించిన అధికారికి ప్రకటన రావాల్సి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిని వచ్చే ఎన్నికల్లో ఓడగొట్టడమే లక్ష్యంగా గతేడాది ఇండియా కూటమి ఏర్పడింది. ఈ కూటమిలో కాంగ్రెస్ తో పాటు జేడీయూ, శివసేన (థాక్రే వర్గం), డీఎంకే, ఆప్, ఆర్జేడీ, టీఎంసీ తదితర పార్టీలు ఉన్నాయి.

Updated : 13 Jan 2024 9:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top