అంబులెన్స్కు దారి ఇచ్చిన ప్రధాని మోడీ
X
ప్రధాని మోడీ ఏ విషయంలోనైనా తనదైన మార్క్ చూపిస్తుంటారు. తాజాగా అలాంటి పనినే చేశారు ఆయన. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేయడం కోసం పీఎం మోడీ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోడీ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో అటుగా ఓ అంబులెన్స్ వచ్చింది. అది గమనించిన ప్రధాని.. వెంటనే తన కాన్వాయ్ ను ఆపి అంబులెన్స్ కు దారి ఇచ్చారు. పీఎం మోడీ చేసిన ఈ పనికి అందరూ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు ప్రధానిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. "రూల్స్ చెప్పడమే కాదు.. పాటించాలి అనే విషయాన్ని ప్రధానిని చూసి నేర్చుకోవాలి" అని కామెంట్ చేస్తున్నారు. కాగా వారణాసిలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా వారణాసి, పూర్వాంచల్ అభివృద్ధి కోసం దాదాపు రూ.19 వేల కోట్ల విలువైన పనులకు పీఎం మోడీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే విధంగా నమో ఘాట్ నుంచి కాశీ తమిళ సంగమం 2.0ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే కన్యాకుమారి నుండి వారణాసికి కొత్తగా రైలు సర్వీసున జెండా ఊపి ప్రారంభించనున్నారు.