Home > జాతీయం > MODI : జటాయువుకు ప్రధాని మోడీ పూజలు

MODI : జటాయువుకు ప్రధాని మోడీ పూజలు

MODI : జటాయువుకు ప్రధాని మోడీ పూజలు
X

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడిప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జటాయువు విగ్రహానికి ప్రధాని మోడీ పూజలు చేశారు. జటాయువుపై పూలు చల్లి ప్రధాని మోడీ పూజలు చేశారు. అంతకు ముందు ఆలయంలోని గర్భగుడిలోకి వెళ్లిన ప్రధాని మోడీ మొదట బాల రాముడికి పట్టు వస్త్రాలు, ఛత్రం సమర్పించారు. ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా రామ్ లల్లాకు 114 కలశాలలో ఔషధ జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలు చేశారు. తర్వాత రాముడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. తర్వాత బాల రాముడి పాదలకు మోడీ సాష్టాంగ నమస్కారం చేశారు.

కాగా జటాయువు పక్షికి రామాయణంలో రామాయణలో విశిష్ట ప్రాధాన్యం కలదు. సీతను రావణాసురుడు అపహరించుకెళ్తున్నప్పుడు జటాయువు పక్షి రావణుడికి అడ్డుపడుతుంది. అతడి చెర నుంచి సీతను విడిపించడానికి జటాయువు రావణుడిపై దాడికి దిగుతుంది. అయితే రావణాసురుడు పదునైన ఖడ్గంతో జటాయువు రెండు రెక్కలను నరికివేయడంతో జటాయువు ఆకాశంలో నుంచి కిందపడుతుంది. అయితే సీతను రక్షించేందుకు జటాయువు చూపిన తెగువ నేటికి ప్రతి హిందువు మదిలో చిరస్థాయిలో నిలిచిపోయింది. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం ప్రాంగణంలో జటాయువు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.




Updated : 22 Jan 2024 10:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top