Home > జాతీయం > ప్రభుత్వం మారకపోతే పరిస్థితులు మారవు.. ప్రియాంక గాంధీ

ప్రభుత్వం మారకపోతే పరిస్థితులు మారవు.. ప్రియాంక గాంధీ

ప్రభుత్వం మారకపోతే పరిస్థితులు మారవు.. ప్రియాంక గాంధీ
X

కేంద్రంలో ప్రభుత్వం మారకపోతే ప్రజల జీవితాల్లో మార్పులు రావని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో శనివారం ప్రియాంక పాల్గొని మాట్లాడారు. దేశంలో మహిళలు, యువత, రైతులకు అన్యాయం జరుగుతోందని, అందుకే రాహుల్ యాత్రలో న్యాయ్ అనే పదాన్ని జోడించారని అన్నారు. నిరుద్యోగులు ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే పేపర్లు లీక్ అవుతున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరుద్యోగుల గురించి ఏమాత్రం పట్టదని, ఈ పేపర్ లీక్ విషయాన్ని తీసుకుంటే అర్థమవుతోందని అన్నారు. అలాగే రైతులంటే కూడా కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఏమాత్రం పట్టింపు లేదని అన్నారు. రైతులకు సంబంధించిన బకాయిలు మాఫీ చేయరని అన్నారు.

తాము చెప్పే మాటలు అర్థం చేసుకొని, అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. కాగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నెల రోజుల కిందట మణిపూర్ లోని ఇంఫాల్ లో ప్రారంభమైంది. మొత్తం 110 జిల్లాల్లోని 100 పార్లమెంట్ స్థానాలతో పాటు 337 అసెంబ్లీ స్థానాలు కవర్ అయ్యేలా యాత్ర కొనసాగుతుంది. మొత్తం 15 రాష్ట్రాల మీదుగా యాత్ర కొనసాగి చివరిగా జోడో యాత్ర ముంబైలో ముగియనుంది. మొత్తం 67 రోజుల్లో 6,700 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. కాగా పేపర్ లీక్ అయిన కారణంగా కానిస్టేబుల్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.


Updated : 24 Feb 2024 10:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top