Priyanka Gandhi : ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు!
X
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రేపటి తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది.
కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు చేవెళ్లలో జరిగే సభకు ప్రియాంక గాంధీ పాల్గొనడం లేదని సమాచారం. అయితే ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించాలనుకున్న 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్‌ల మీద ఇంకా సమాచారం అందలేదు. అయితే ఈ హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఉన్నందునే ప్రియాంక గాంధీ రేపు తెలంగాణకు రావడం లేదని తెలుస్తోంది. గత మూడు రోజులుగా ప్రియాంక.. రాహుల్ తో కలిసి యూపీలో పర్యటిస్తున్నారు. నిన్నటి జోడో యాత్రలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లోని హామీల్లో ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంపు హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక రేపటి నుంచి రూ.500 కే సిలిండర్, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ లు ప్రారంభం కానున్నాయి.