Home > జాతీయం > జోడో యాత్రకు అడ్డుపడిన బీజేపీ కార్యకర్తలు.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్

జోడో యాత్రకు అడ్డుపడిన బీజేపీ కార్యకర్తలు.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్

జోడో యాత్రకు అడ్డుపడిన బీజేపీ కార్యకర్తలు.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్
X

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అస్సాంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన బస్సుయాత్ర చేస్తుండగా బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ జెండాల చేతబూని రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న బస్సుకు ఎదురుగా వచ్చారు. రాహుల్ గో బ్యాక్ , జై మోడీ అంటూ నినాదాలు చేశారు. అయితే బస్సులోపల ఉన్న రాహుల్ గాంధీ కిందకి దిగేందకు ప్రయత్నించగా సెక్యూరిటీ వద్దని వారించారు. దీంతో బస్సు అద్దాలలో నుంచి ఆయన బీజేపీ శ్రేణులకు అభివాదం చేశారు. అనంతరం వారికి నవ్వుతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య కొంతసేపటి వరకు వాగ్వివాదం జరిగింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. కాగా రాహుల్ గాంధీ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ శ్రేణులు ఆయన యాత్రకు అడ్డుపడేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

Updated : 21 Jan 2024 7:19 PM IST
Tags:    
Next Story
Share it
Top