Home > జాతీయం > MODI : రాముడికి ఇక టెంట్ కింద ఉండాల్సిన పనిలేదు.. ప్రధాని మోడీ

MODI : రాముడికి ఇక టెంట్ కింద ఉండాల్సిన పనిలేదు.. ప్రధాని మోడీ

MODI : రాముడికి ఇక టెంట్ కింద ఉండాల్సిన పనిలేదు.. ప్రధాని మోడీ
X

ఇక నుంచి రాముడికి టెంట్ కింద ఉండాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ అన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోడీ ఎమోషనల్ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోట్ల మంది హిందువుల ఎన్నో ఏళ్ల కల నేడు నెరవేరిందని అన్నారు. 2024, జనవరి 22 దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా బానిస మనస్తత్వంతో ఉన్న మనందర్ని విముక్తి చేయడానికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాముడు మళ్లీ వచ్చాడని అన్నారు. దీని కోసం కొన్ని శతాబ్దాల పాటు వేచి చూడాల్సి వచ్చిందని అన్నారు. రామ్ లల్లా ఇక నుంచి టెంట్ కింద కాకుండా తన ఆలయంలో ఉంటాడని అన్నారు.

రాముడి గురించి మన రాజ్యాంగంలో కూడా ఉన్నదని, నేటితో రాజ్యాంగంలో రాముడి ప్రస్తావనకు పూర్తి నిజం చేకూరిందని అన్నారు. కాగా అంతకు ముందు ఆలయంలోని గర్భగుడిలోకి వెళ్లిన ప్రధాని మోడీ మొదట బాల రాముడికి పట్టు వస్త్రాలు, ఛత్రం సమర్పించారు. ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా రామ్ లల్లాకు 114 కలశాలలో ఔషధ జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలు చేశారు. తర్వాత రాముడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. తర్వాత బాల రాముడి పాదలకు మోడీ సాష్టాంగ నమస్కారం చేశారు.




Updated : 22 Jan 2024 3:22 PM IST
Tags:    
Next Story
Share it
Top