Home > జాతీయం > పేటీఎంకు బిగ్ రిలీఫ్.. మార్చి 15వరకు గడువు ఇచ్చిన ఆర్బీఐ

పేటీఎంకు బిగ్ రిలీఫ్.. మార్చి 15వరకు గడువు ఇచ్చిన ఆర్బీఐ

పేటీఎంకు బిగ్ రిలీఫ్.. మార్చి 15వరకు గడువు ఇచ్చిన ఆర్బీఐ
X

పేటీఎంకు ఆర్బీఐ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మార్చి 15 వరకు లావాదేవీలను కొనసాగించేందుకు గడువు ఇచ్చింది. పేటీఎమ్ కస్టమర్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై విధించిన నిషేధాన్ని మార్చి 15కు సడలించినట్లు ఆర్బీఐ ప్రకటించింది.క‌స్ట‌మ‌ర్ ఖాతాలపై టాప‌ప్, క్రెడిట్ లావాదేవీలు, డిపాజిట్ల సేక‌ర‌ణ‌, వాలెట్లు, ఫాస్టాగ్ ఖాతాల నిర్వ‌హ‌ణ నిలిపివేత గ‌డువును ఆర్బీఐ పొడగించింది. మ‌ర్చంట్ల‌తోపాటు క‌స్ట‌మ‌ర్ల ప్ర‌యోజనాల‌ను దృష్టిలో పెట్టుకుని 15 రోజుల గ‌డువు పెంచిన‌ట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ ఓ సర్కులర్‌ను జారీ చేసింది. గడువులోగా పేటీఎం అకౌంట్స్, వాలెట్ నుంచి తమ నగదు మొత్తాన్ని డిపాజిటర్లు విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. స్వీప్ ఇన్, స్వీప్ అవుట్ విధానంలో ఇతర బ్యాంకులకు తమ నగదును బదిలీ చేయించుకునే అవకాశాన్ని పేటీఎం యాజమాన్యం డిపాజిటర్లకు కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది.

కాగా ఈ నెల 29 తర్వాత నుంచి పేటీఎం వ్యాలెట్లు, ఖాతాలు, ఫాస్టాగ్ రీచార్జ్‌లు, టాప్ అప్‌లు స్వీకరించవద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను ఆర్బీఐ గత జనవరి 31న ఆదేశించింది. అయితే, ఇప్పటికే రీచార్జ్ చేసి ఉంటే, ఆ నగదును గడువులోపు వినియోగించుకోవచ్చని సూచించింది. ఆర్బీఐ ఈ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి. కేవైసీ పూర్తి చేయకుండానే బ్యాంకు ఖాతాల నిర్వహణ, మనీ లాండరింగ్ వంటి ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ పేటీఎంపై ఆంక్షలు విధించింది. ఇప్పుడీ నిర్ణయం ఇతర పేమెంట్స్ బ్యాంకులపైనా పడుతోంది. ఇప్పటికే ఇతర పేమెంట్స్ బ్యాంకులపైనా RBI నిఘా పెట్టింది. పేటీఎం లాగా మరో 4 సంస్థల KYC నిర్వహణలో కూడా లోపాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. అయితే కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 15 తేదీ వరకు పేటీఎం లావాదేవీలకు అనుమతినిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

Updated : 16 Feb 2024 9:53 PM IST
Tags:    
Next Story
Share it
Top