Who is Sanjay Singh : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా సంజయ్ సింగ్
X
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. ఇవాళ ఢిల్లీలో ఆ సంఘంకు జరిగిన ఎన్నికల్లో అనితా షియోరాన్‌ను ఓడించి సంజయ్ సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల గ్లోబల్ రెజ్లింగ్ ఫెడరేషన్, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ లు WFIపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతో WFI ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఢిల్లీలోని WFI కార్యాలయంలో ప్రెసిడెంట్ తోపాటు ఇతర పోస్టులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్(Who is Sanjay సింగ్ ), నితా షియోరాన్ అధ్యక్ష బరిలో నిలిచారు. అయితే మొత్తం 47 ఓట్లలో 40 ఓట్లు సాధించి సంజయ్ సింగ్ విజయకేతనం ఎగురవేశారు. ఇక గతంలో సంజయ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ రెజ్లింగ్ ఫెడరేషన్ కు వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు. అలాగే 2019 నుంచి గత WFI ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఇక ప్రెసిడెంట్ తో పాటు ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్, 4 వైస్ ప్రెసిడెంట్స్, ఒక సెక్రటరీ, ఓ ట్రెజరర్, 2 జాయింట్ సెక్రటరీలు, 5 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించారు. ఇక వైస్ ప్రెసిడెంట్ పోస్టు కోసం పోటీపడ్డ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఓడిపోయారు.