Home > జాతీయం > రాహుల్ గాంధీ కారుపై దాడి.. ఖండించిన కాంగ్రెస్

రాహుల్ గాంధీ కారుపై దాడి.. ఖండించిన కాంగ్రెస్

రాహుల్ గాంధీ కారుపై దాడి.. ఖండించిన కాంగ్రెస్
X

భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్నారు. కాగా బెంగాల్ లోని మాల్దాలో రాహుల్ గాంధీ కారుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అప్రమత్తం కావడంతో సురక్షితంగా రాహుల్ అక్కడి నుంచి బయటపడి బస్సులోకి వెళ్లి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ మండిపడ్డారు. ఇలాంటి దాడులు కరెక్ట్ కాదని అన్నారు. కావాలనే కొన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు రాహుల్ యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. రాహుల్ యాత్రతో బీజేపీ నేతల్లో భయం మొదలైందని విమర్శించారు. అందుకే వారు రాహుల్ యాత్రను అడ్డుకోవడానికి అనేక విధాల ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ఇటీవల మణిపూర్, అస్సాంలో కూడా ఇలాగే వ్యవహరించారని అన్నారు. బీజేపీ ఎన్ని విధాలుగా ఆటంకాలు సృష్టించినా రాహుల్ తన యాత్రను అనుకున్న గడువులోగా పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. కాగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక ఆటంకం సృష్టించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మణిపూర్ లో రాహుల్ యాత్రను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇక తాజా ఘటన కూడా రాహుల్ యాత్రను అడ్డుకోవడానికేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Updated : 31 Jan 2024 10:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top