రామ మందిర ప్రారంభోత్సవానికి సోనియా, ఖర్గేలకు ఆహ్వానం
X
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ట్రస్ట్ ఆహ్వానించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ తెలిపారు. ఇక సోనియా, ఖర్గేలు వెళ్తారా లేదా అన్నది త్వరలోనే తెలియజేస్తామని పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది (2024) జనవరి 22న అయోధ్య రామ మందిరాన్న ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులతో పాటు సినీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పలువురు క్రీడాకారులు హాజరుకానున్నారు. అలాగే ఈ వేడుకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను కూడా ట్రస్ట్ ఆహ్వానించింది. మందిర ప్రారంభానికి వారం ముందే అంటే జనవరి 16 నుండి వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. వారణాసికి చెందిన వేద పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22 న రాముని విగ్రహానికి పట్టాభిషేకం చేసి ప్రధాన ఆచారాలను నిర్వహిస్తారు. జనవరి 14 నుండి జనవరి 22 వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవం జరగనుంది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రకారం ఈ కార్యక్రమం కోసం 10,000-15,000 మందికి ఏర్పాట్లు చేస్తున్నారు.