Home > జాతీయం > మోడీ రాష్ట్రాలను ATMలుగా మార్చారు.. తమిళనాడు సీఎం స్టాలిన్

మోడీ రాష్ట్రాలను ATMలుగా మార్చారు.. తమిళనాడు సీఎం స్టాలిన్

మోడీ రాష్ట్రాలను ATMలుగా మార్చారు.. తమిళనాడు సీఎం స్టాలిన్
X

ప్రధాని మోడీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వాలను తనకు డబ్బు ఇవ్వడానికి ATMలుగా మార్చుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు రాకుండా ఆపేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాలు తెచ్చినా, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరగవని, కనీసం రాష్ట ముఖ్యమంత్రులతో చర్చలు ఉండవని అన్నారు. NEP, GST, NEET విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను పరిగణలోకి తీసుకోలేదని అన్నారు.

రాజ్యాంగ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న అన్ని హక్కులను మోడీ ప్రభుత్వం హరించి వేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను బీజేపీ పాలిత రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని అన్నారు. ఇటీవల తమ రాష్ట్రంలో భారీ ప్రకృతి విపత్తు వస్తే కేంద్రం ఎలాంటి సహాయం చేయలేదని అన్నారు. తుఫాన్ విధ్వంసం వల్ల జరిగిన నష్టానికి పూడ్చడానికి రూ.37,000 కోట్ల నిధులు ఇవ్వాలని అడిగితే.. కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రధాని మోడీ తానూ ఒకప్పుడు సీఎం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని స్టాలిన్ అన్నారు.

Updated : 21 Jan 2024 9:54 PM IST
Tags:    
Next Story
Share it
Top