Home > జాతీయం > ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారు.. జేడీయూ ఎమ్మెల్యేలపై తేజస్వి యాదవ్ ఫైర్

ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారు.. జేడీయూ ఎమ్మెల్యేలపై తేజస్వి యాదవ్ ఫైర్

ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారు.. జేడీయూ ఎమ్మెల్యేలపై తేజస్వి యాదవ్ ఫైర్
X

జేడీయూ ఎమ్మెల్యేలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఫైర్ అయ్యారు. సోమవారం బీహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష చర్చలో తేజస్వి యాదవ్ మాట్లాడారు. తమతో బంధాన్ని తెచ్చుకొని జేడీయూ పెద్ద తప్పు చేసిందని అన్నారు. గతంలో జేడీయూ నేతలు బీజేపీని విమర్శించేవాళ్లని, కానీ నేడు వాళ్లు బీజేపీని పొగుడుతున్నారని అన్నారు. గతంలో బీజేపీని తిడితే తప్ప జేడీయూ ఎదగలేదని అన్నారు. మరి ఇప్పుడు ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని నిలదీశారు. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న నితీశ్.. ఈ ఒక్కసారికే మూడు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని ప్రశ్నించారు. ఇక ప్రజల కోసం తమ పదవులు వదులుకున్నామని ప్రజలకు చెబుతామనిన తేజస్వి అన్నారు.

కాగా బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఇవాళ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా తన సర్కారుకు ఎమ్మెల్యేల మద్దతు కోరనున్నారు. ఈ నేపథ్యంలో బలపరీక్ష కోసం ఇప్పటికే బీహార్ అసెంబ్లీ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం వైపు కూర్చోవడం చర్చనీయాంశమైంది. కాగా మొన్నటి వరకు ఇండియా కూటమిలో ఉన్న నితీశ్ కుమార్ ఇటీవలే ఎన్డీఏలోకి చేరిపోయారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే సపోర్టు తో 15 రోజుల కిందట సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

Updated : 12 Feb 2024 2:56 PM IST
Tags:    
Next Story
Share it
Top