త్వరలో భారత్ జోడో యాత్ర 2?
X
భారత్ జోడో యాత్ర -2 కు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ జోడో యాత్రకు విశేష ఆదరణ రావడంతో భారత్ జోడో యాత్ర -2కు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సౌత్ (తమిళనాడు) నుంచి యాత్ర మొదలు పెట్టి నార్త్ (కశ్మీర్)లో ముగించారు. ఇక భారత్ జోడో యాత్ర -2లో భాగంగా తూర్పు నుంచి పడమర వరకు యాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాలుపంచుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది మే లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2024 జనవరి మొదటి వారం నుంచే యాత్రను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. కాగా రాహుల్ గాంధీ నేతృత్వంలో గతేడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర మొదలైంది. మొత్తం 12 రాష్ట్రాల మీదుగా 136 రోజుల పాటు 4080 కిలోమీటర్లు సాగిన ఈ యాత్ర.. 2023 జనవరి 30న కశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగిసింది.