Home > జాతీయం > ఆ జడ్జిలకు రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం!

ఆ జడ్జిలకు రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం!

ఆ జడ్జిలకు రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం!
X

ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ దేశంలోని పలువురి ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. తాజాగా అయోధ్య కేసులో కీలక తీర్పునిచ్చిన అప్పటి సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు జడ్జిలకు ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. నాలుగేళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై చారిత్రాత్మక అంతిమ తీర్పునిచ్చింది. ఇప్పుడా ఐదుగురు జడ్జిలకు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. మాజీ సీజేఐ రంజన్ గోగోయ్, మాజీ సీజేఐ ఎస్ఏ బోబ్డే, ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ 2019లో చారిత్రక తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.

కాగా.. రామ మందిరం ప్రారంభోత్సవానికి దాదాపు 7 వేల మంది అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలతో పాటు రాజకీయనేతలు, సెలెబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, ఇతర రంగాలకు చెందిన తదితరులు హాజరుకానున్నారు. ఇక ఈ కార్యక్రమం కోసం జనవరి 22న ఇప్పటికే పలు రాష్ట్రాలు సెలవు దినంగా ప్రకటించగా.. కేంద్ర ప్రభుత్వం సగం సెలవు ప్రకటించింది.




Updated : 19 Jan 2024 10:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top