Home > జాతీయం > వాళ్లకూ రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వాళ్లకూ రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వాళ్లకూ రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం
X

ఈ నెల 22న అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రారంభ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు, బిజినెస్ మెన్, సెలెబ్రిటీలు హాజరుకానున్నారు. ఇప్పటికే వాళ్లందరికీ ఆహ్వానాలు అందాయి. కాగా తాజాగా వివిధ రంగాల్లో తాము చేసిన కృషికి 'పద్మ' (పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ) అవార్డులు అందుకున్న వాళ్లకి కూడా ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానాలు అందించామని శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. వాళ్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 150 మందికి పైగా ప్రముఖ సాధువులను కూడా ఆహ్వానించామని చెప్పారు. ఇక గర్భగుడిలోకి ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, నృత్య గోపాల్ జీ మహారాజ్, యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి, యూపీ గవర్నర్ తో పాటు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టీలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. ఇక సాధారణ జనానికి జనవరి 23 నుంచి అయోధ్య రామ మందిరంలోకి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

Updated : 15 Jan 2024 11:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top