Home > జాతీయం > చంఢీగడ్ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

చంఢీగడ్ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

చంఢీగడ్ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

చంఢీగఢ్ మేయర్ ఎన్నికలు జరిగిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, అతడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని దేశ అత్యున్న న్యాయస్థానం అభిప్రాయపడింది. చంఢీగడ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ కేసును ఇవాళ విచారించిన కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. చంఢీగడ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని సాక్షాలను బట్టి చూస్తే తెలుస్తోందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే చంఢీగడ్ మేయర్ ఎన్నికల ప్రక్రయను నిలిపివేసి, ఆ ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా కోర్టుకు సమర్పించాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. వీడియోలో చూస్తే రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్లను తారుమారు చేశారని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. రిటర్నింగ్ అధికారి కెమెరాలో చూస్తూ బ్యాలెట్ పేపర్ ను పాడుచేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

ఎన్నికలు నిర్వహించే తీరు ఇదేనా అని రిటర్నింగ్ అధికారిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, రిటర్నింగ్ అధికారిని వెంటనే ప్రాసిక్యూట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. కాగా చంఢీగడ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూటమిగా పోటీ చేశాయి. మేయర్ సీటుపై ఆప్ పోటీచేస్తే.. డిప్యూటీ మేయర్ సీటుకి కాంగ్రెస్ పోటీ చేసింది. రెండు పార్టీలకు కలిపి 20 ఓట్లు ఉండడంతో ఆప్ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా బిజేపీ గెలుపొందిందని ఎన్నికల అధికారి మసీహ్ ప్రకటించారు. దీంతో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి బీజేపీ మైనారిటీ సెల్ సభ్యుడని, ఈ క్రమంలోనే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి బీజేపీ గెలిచిందంటూ ప్రకటించారని అన్నారు.




Updated : 5 Feb 2024 12:00 PM GMT
Tags:    
Next Story
Share it
Top