Home > జాతీయం > చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
X

చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ ను మేయర్ గా సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఓట్ ట్యాంపరింగ్ ఆరోపణలపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా గత నెల 30న చండీగఢ్ మేయర్ ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్‌లో 35 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఆప్-కాంగ్రెస్ కూటమికి 20, బీజేపీకి 14, ఎస్ఏడీకి ఒక కౌన్సిలర్ ఉన్నారు. మేయర్ ఓటింగ్ సందర్భంగా ఆప్-కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది కౌన్సిలర్ల ఓట్లను చెల్లనివిగా ఆర్వో అనిల్ మాసిహ్ ప్రకటించారు. బీజేపీ మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్‌ను విజేతగా ప్రకటించారు.

అయితే బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ క్రాస్ మార్క్‌ పెడుతున్నట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ వీడియో బయటకు రావడంతో రాజకీయంగా తీవ్ర కలకలం రేగింది. దీంతో ఆప్ కౌన్సిలర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మంగళవారం మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం.. అనిల్ మాసిహ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే బ్యాలెట్ పేపర్లను కొట్టివేశారని మండిపడింది. ఈ క్రమంలోనే చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదంటూ ఆప్ కౌన్సిలర్ ను విజేతగా ప్రకటించింది. కాగా సుప్రీంకోర్టు తాజా తీర్పుపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.




Updated : 20 Feb 2024 12:16 PM GMT
Tags:    
Next Story
Share it
Top