అందరికీ స్పూర్తి.. మన ఉప రాష్ట్రపతి
X
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనేది మనందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మరోసారి నిరూపించారు. దేశంలోనే రెండో అత్యున్నత పదవి (ఉపరాష్ట్రపతి)లో ఉన్న ఆయన.. తాజాగా కేరళలో పర్యటించారు. ఈ నేపథ్యంలో తనకు చదువు చెప్పిన గురువుల కాళ్లకు నమస్కారం చేసి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచారు. వ్యక్తులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా కన్న తల్లిదండ్రులు, గురువులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలనే సందేశాన్ని వైస్ ప్రెసిడెంట్ నిరూపించారు. కాగా ఇటీవల జరిగిన పార్లమెంట్ పై దాడి వ్యవహారంలో పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాజ్యసభలో తృణమూల్ పార్టీకి చెందిన ఎంపీ కల్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ను కించపరిచేలా వ్యవహరించారు. సభా వ్యవహారాలను నడిపే సమయంలో ఆయన బాడీ లాంగ్వేజ్ ను, భాషను మిమిక్రీ చేస్తూ వైస్ ప్రెసిడింట్ ను కించపరిచేలా ప్రవర్తించారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ ను కించపరిచేలా ప్రవర్తించిన సదరు సభ్యుడిని సభ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని అధికార పార్టీకి చెందిన సభ్యులు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయమై పీఎం మోడీ ఉప రాష్ట్రపతికి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా తాను 20 ఏళ్లుగా ఇలాంటి అవమానాలను ఎదుర్కొంటున్నానని మోడీ తనతో చెప్పినట్లు వైస్ ప్రెసిడెంట్ చెప్పిన విషయం తెలిసిందే.