రెజ్లర్ భజరంగ్ పునియా సంచలన ప్రకటన
X
భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) కొత్త చీఫ్ గా సంజయ్ సింగ్ నిన్న ఎన్నికైన విషయం తెలిసిందే. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI మాజీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సంజయ్ సింగ్ సన్నిహితుడు. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్ ఎన్నికకు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికే సంజయ్ సింగ్ ఎన్నికపై అసంతృప్తితో భారత్ స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా మరో స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా సంచలన ప్రకటన చేశారు. భారత ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీని తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. మహిళలను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ WFI కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవడం బాధేసిందని అన్నారు. మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులపై తాము చేసిన పోరాటానికి ఏమాత్రం విలువ లేకుండాపోయిందని వాపోయారు. అలాంటప్పుడు పద్మశ్రీకి ఏం విలువ ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.