Home > జాతీయం > WFI కొత్త కమిటీ సస్పెండ్.. సాక్షి మాలిక్ రియాక్షన్ ఇదే

WFI కొత్త కమిటీ సస్పెండ్.. సాక్షి మాలిక్ రియాక్షన్ ఇదే

WFI కొత్త కమిటీ సస్పెండ్.. సాక్షి మాలిక్ రియాక్షన్ ఇదే
X

భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్‌ను సస్పెండ్ చేస్తూ భారత క్రీడా శాఖ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో ఉత్తరప్రదేశ్ గోండాలో జరిగే కుస్తీ పోటీలకు తొందరపాటుగా అండర్-15, అండర్-20 జట్లను ఎంపిక చేసినందుకుగాను క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా ఎన్నికైన కమిటీపై భారత స్టార్ రెజ్లర్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్యానెల్ ను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ స్పందించారు. రెజ్లర్లకు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం శుభ పరిణామం అని అన్నారు. తమ పోరాటం ఈ దేశ ఆడబిడ్డల కోసం చేసిన పోరాటంగా ఆమె అభివర్ణించారు. తమ పోరాటంలో ఇది మొదటి అడుగు అని ఆమె అన్నారు. ఇక తన రిటైర్ మెంట్ పై స్పందించిన ఆమె.. కొత్త ఫెడరేషన్ ప్యానెల్ ఏర్పాటు తర్వాత తన నిర్ణయం చెబుతానని అన్నారు.

కాగా WFI ప్రెసిడెంట్ గా కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్.. గత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు అత్యంత సన్నిహితుడు. ఈ క్రమంలో రెజ్లర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్ మెంట్ ప్రకటించగా.. మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. అనంతరం వారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో క్రీడా శాఖ కొత్త ప్యానెల్ ను సస్పెండ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated : 24 Dec 2023 9:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top